Share News

స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:54 PM

స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్‌ ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్‌ ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు యువత చేతిలో మొబైల్‌తో ఆన్‌లైన్‌ గేమ్స్‌, మద్యం, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారన్నారు. ఇతర వేశారు భారతదేశాన్ని అనుసరిస్తుంటే మనం మాత్రం మోడ్రన్‌ కల్చర్‌ పేరుతో విదేశీ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నామన్నారు. యువత సెల్‌ఫోన్‌ను పక్కనబెట్టి మనసును స్మార్ట్‌గా చేసుకోవాలని సూచించారు. స్వామీ వివేకానంద కన్న కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్న భారత్‌ను నాలుగో స్థానానికి తీసుకొచ్చారని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించారన్నారు. యువత అభివృద్ధి, సంక్షేమం, క్రీడలపై మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు. అనంతరం బండి సంజయ్‌కుమార్‌ పలువురికి స్పోర్ట్స్‌ కిట్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:54 PM