యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
ABN , Publish Date - May 04 , 2026 | 12:50 AM
రాష్ట్ర ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
భగత్‌నగర్, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ 67వఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్దం ఎల్లారెడ్డిభవన్ ఎదుట ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ పతాకాన్ని పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పాలక పక్షాలు అవలంబిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఉద్యమించాలన్నారు. 1958 మే 3న ఏఐవైఎఫ్ ఆవిర్భవించిందన్నారు. 67 సంవత్సరాలుగా ఏఐవైఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందన్నారు. నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని, అనేకమంది డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసి ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పైవ్రేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో మాదక ద్రవ్యాలు నిలువరించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పైడిపల్లి రాజు, జిల్లా మాజీ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నగర ఉపాధ్యక్షుడు పినమల్ల భాస్కర్, బి రమేష్ హేమంత్, శ్రీనివాస్ నాయక్, బీర్ల పద్మ కటిక రెడ్డి బుచ్చన్న, లక్ష్మి, శ్రావణి, స్వాతి, అఖిల, బోయిన విష్ణు, తిరుమల్, సందీప్, మహేష్, నరేష్ పాల్గొన్నారు.