ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:42 AM
యువ తలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి యువజనో త్సవాలు చక్కటి వేదికగా నిలుస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : యువ తలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి యువజనో త్సవాలు చక్కటి వేదికగా నిలుస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. శుక్రవారం పట్ట ణంలోని మినీ స్టేడియంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ హాజరయ్యారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి యువజనోత్సవా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలు, చిత్ర లేఖనం, పాటలు, నృత్య కళలో రాణించాలన్నారు. క్రీడ లు, కళలు, సాంస్కృతిక రంగాల్లో పాల్గొంటే యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయ కత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. భారత దేశ భవిష్యత్తు యువత చేతులో ఉందని, ఆధునిక పోకడ లతో కూడిన నేటి సమాజంలో యువత చెడు వ్యసనా లకు అలవాటు పడకుండా వారిలోని నైపుణ్యాలను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమ ని అన్నారు. రాబోయే రోజులలో యువత అన్ని రంగా లలో మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. అనంతరం కల్చరల్ ట్రాక్, పీపీటీ చాలెంజ్ ట్రాక్ పోటీలను నిర్వ హించారు. కల్చరల్ ట్రాక్‌లో సాంస్కృతిక పోటీలు, జాన పద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, కవిత్వం, పెయిటింగ్, పోస్టర్ మేకింగ్, నుకడ్ నాటక్, పీపీటీ ఛాలెంజ్ ట్రాక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఫ్యూచర్ రెడీనెస్ అనే అంశం ద్వారా కార్యక్రమాలను నిర్వహించారు. యువతి, యువకులు పోటీ పడుతూ తమ ప్రతిభను చాటారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిథి డీవైఎస్‌వో రాం దాస్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధి కారి అజ్మీరా రాందాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల, జీఎం ఇండస్ట్రీ ఎండి హనుమంతరావు, యంగ్ ఇండస్ట్రీ నోడల్ ఆఫీసర్ దేవత ప్రభాకర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్ర కళ ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు, యువతి, యువకులు పాల్గొన్నారు.