Share News

యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీకి పట్టుకొమ్మలు..

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:13 AM

యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టుకొమ్మలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి పెద్దెల్లి తేజస్వి ప్రకాష్‌ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్‌ అధ్యక్షతన ఆదివారం యువజన కాంగ్రెస్‌ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది.

యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీకి పట్టుకొమ్మలు..
మాట్లాడుతున్న యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి పెద్దెల్లి తేజస్వి ప్రకాష్‌

కరీంనగర్‌ అర్బన్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టుకొమ్మలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి పెద్దెల్లి తేజస్వి ప్రకాష్‌ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్‌ అధ్యక్షతన ఆదివారం యువజన కాంగ్రెస్‌ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి పెద్దెల్లి తేజస్వి ప్రకాష్‌ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని మండల, గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, యువజన కాంగ్రెస్‌ కార్యక్రమాలను ప్రతినెల ఐవైసీ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కృపాసాగర్‌, మానకొండూరు అధ్యక్షుడు అట్ల అనిల్‌, చొప్పదండి, హుజురాబాద్‌, నియోజకవర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:14 AM