Share News

సేఫ్టీ పద్ధతిలో డ్రైవింగ్‌ చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:24 AM

యువత డ్రైవింగ్‌లో సేఫ్టీ పద్ధతిని పాటించాలని రోడ్‌ సేఫ్టీ ఐజీ రమేష్‌ నాయుడు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం చొప్పదండిలో అరైవ్‌ అలైవ్‌, రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 సేఫ్టీ పద్ధతిలో డ్రైవింగ్‌ చేయాలి
మాట్లాడుతున్న ఐజీ రమేష్‌ నాయుడు

చొప్పదండి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): యువత డ్రైవింగ్‌లో సేఫ్టీ పద్ధతిని పాటించాలని రోడ్‌ సేఫ్టీ ఐజీ రమేష్‌ నాయుడు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం చొప్పదండిలో అరైవ్‌ అలైవ్‌, రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌, సీట్‌ బెల్టు ధరించకపోవడంతోనే ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నదన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలకు పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్‌ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాల బారిన పడిన వ్యక్తులను కాపాడాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు.

ఫ రహవీర్‌గా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం...

గంగాధర మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్దురాలిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన వాహనంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ప్రభుత్వం రహవీర్‌గా గుర్తించినట్లు ఐజీ రమేష్‌ నాయుడు, సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు 25 వేల రూపాయల పారితోషికాన్ని అందిస్తామని తెలిపారు. ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఐజీ, సీపీలు సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ పెరుమాండ్ల మానస, ఏసీపీ విజయ్‌ కుమార్‌, సీఐ ప్రదీప్‌ కుమార్‌, చొప్పదండి ఎస్‌ఐ నరేష్‌రెడ్డి, గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణ, రామడుగు ఎస్‌ఐ రాజు, మార్కెట్‌ చైర్మన్‌ కొత్తూరు మహేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:24 AM