Share News

ధాన్యం కొనుగోలుకు అధికారుల కాలర్‌ పట్టుకోవాలి

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:35 AM

ధాన్యం కొనుగోలుకు అధికారుల కాళ్లు కాదు.. కాలర్‌ పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు.

ధాన్యం కొనుగోలుకు అధికారుల కాలర్‌ పట్టుకోవాలి

సిరిసిల్ల, సిరిసిల్ల అర్బన్‌ జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలుకు అధికారుల కాళ్లు కాదు.. కాలర్‌ పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. పుష్కర తెలంగాణ ముష్కరుల చేతిలో పడిందని, దిక్కుమాలిన కాంగ్రెస్‌ పాలనలో వడ్డించిన విస్తరి లాం టి తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా అవుతోందన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగా ణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించి పుష్కరకా లం గడిచిందని, కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాలు, రైతులు, వ్యవసాయాన్ని బాగు చేశారని అన్నారు. పుష్కరకాలం గడిచిపోయిందని, దురదృష్టవశాత్తు ముష్కరులు, చాలా దుర్మార్గమైన కాంగ్రెస్‌ చేతుల్లోకి పోయిందని అన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్నట్లుగా బంగారం పళ్లెంలో పెట్టి తెలంగాణ ను అప్పగిస్తే కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్‌ పాలనలో ఉందన్నారు. గ్రామాల్లో రైతులు గోస పడుతున్నారన్నారు. షాపుల్లో యూరియా లేదని.. యాపుల్లో ఇస్తారట అని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నరేం ద్ర మోదీ, రేవంత్‌రెడ్డిలకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదని రైతులకు అర్థం అవుతోందన్నారు. కేసీఆర్‌ పాలనలో నాట్లు వేసే సమయానికి రైతు బంధు రైతుల ఖాతాల్లో పడేవని అన్నారు. రేవంత్‌రెడ్డి నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టాడని, కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే రైతుబంధు వేస్తారని అన్నారు. పార్లమెంట్‌, పంచాయతీ ఎన్నికల్లో రైతుబంధు వేశారని, ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు రైతుబంధు వేసే తెలివి లేదన్నారు. మళ్లీ యూరియా కష్టాలే కాకుండా కరెంటు కష్టాలు వచ్చాయని, మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయని అన్నారు. మళ్లీ 2014 కంటే ముందు పరి స్థితులు వచ్చాయన్నారు. కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి కుప్ప ల వద్దనే రైతులు ఉంటున్నారని అన్నారు. కేసీఆర్‌ కళ్లకు అద్దుకొని ధాన్యం కొనేవారని, ఇప్పుడు రైతులు అధికారుల కాళ్ల మీద పడుతున్నారన్నారు. అధికారుల కాళ్ల మీద కాదు కాలర్‌, గల్లా పట్టుకొని ధాన్యం ఎందుకు కొన రని అడగాలన్నారు. 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసి గోస పడుతున్నారని, రాహుల్‌గాంధీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తానని అన్నాడని.. వస్తుందా అంటూ ప్రశ్నించారు. కరెంటు వ్యవస్థ కోసం రైతు డిస్కం పెడతానని చెప్తున్న రేవంత్‌రెడ్డిని ఏ రైతు అడిగాడన్నారు. కేసీ ఆర్‌ 24గంటలు కరెంటు రైతు డిస్కం లేకుండానే ఇచ్చాడని అన్నారు. రైతు లను ముంచేందుకే మోటార్లకు మీటర్లు పెట్టడానికి, ట్రాన్స్‌ఫార్మర్లకు మీట ర్లు పెట్టడానికి మాట్లాడుతున్నాడన్నారు. అమెరికాలో రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు దండుగ, మూడు గంటలు సరిపోతుందని అన్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని రెన్యూవల్‌ సీఎం అని అన్నారు. ఢిల్లీకి కప్పం కడితేనే రెన్యూవల్‌ అవుతుందని, అందుకే రైతు బంధు లేదని, కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత బుడ్డ పైసా పని చేయలేదని, ప్రశ్నించిన నాయకులుపై దొంగ కేసులు పెట్టి సతాయిస్తున్నారని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని బాండ్‌ పేపర్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి మూడు నెలల్లోనే పిల్లలు పుడతారా అని మాట్లాడుతున్నారని, రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఏమైందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ జిందం కళచక్రపాణి, గుడూరి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:35 AM