రోజూ యోగా సాధన చేయాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:27 AM
యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగా లు ఉన్నాయని, రోజు యోగా సాధన చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగా లు ఉన్నాయని, రోజు యోగా సాధన చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తు న్న వారోత్సవాల సందర్భంగా ఆయుష్ విభాగం ఇతర శాఖల సంయుక్త భాగస్వామ్యంతో యోగాపై అవగాహ న, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం యోగా గురు వు యోగాసనాలు, ధ్యానం చేయించారు ధ్యానం, యో గాసనాలతో కలిగే లాభాలను వివరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మార్చి 6న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారం భించారని, ఇందులో భాగంగా జూన్ 12వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామని తెలిపారు. వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగా హన సదస్సులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా సాధన చేయాలని పిలు పునిచ్చారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. అనంతరం ఆయు ష్ ఆధ్వర్యంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ముఖ్య అతిథు లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, డీవైఎస్‌వో రాందాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.