అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం యోగా
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:44 AM
అంతర్గత శక్తిని మేల్కొ లిపే అమూల్య సాధనం యోగా అని, దీంతో ఆరోగ్యంతోపాటు మేధా శక్తి పెరుగుతుందని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : అంతర్గత శక్తిని మేల్కొ లిపే అమూల్య సాధనం యోగా అని, దీంతో ఆరోగ్యంతోపాటు మేధా శక్తి పెరుగుతుందని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎస్పీ పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది తో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసి క, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమన్నారు. భారతీయతత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుందన్నారు. వివిధ దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాను వినియోగంలోకి తీసుకొచ్చాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీబిజీగా ఉండే అధికా రులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించలన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉం డటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనా రోగ్యాలకు గురవుతున్నారని అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవాలందించగలమన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని తెలిపారు. ప్రస్తుతం వేగవం తమైన జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు యోగాభ్యాసానికి దైనందిన జీవితంలో కొంత సమయం కేటా యించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్ర య్య, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వర రావు, మొగిలి, నటేష్, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, ఉపేందర్‌చారి, రంజిత్, ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, శ్రీనివాస్, సాయి కిరణ్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలి యన్‌లో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ యోగా దినోత్సవంలో బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ పాల్గొని అధికారులు, సిబ్బందితో కలిసి యోగా అసనాలు వేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎంఐ సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్‌లు రాందాస్, సురేష్, ఆర్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.