రచయితలు, కవులు దిశా నిర్దేశం చేయాలి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:26 AM
రచయితలు, కవులు సమాజం కంటే ముందుండి తమ రచనల ద్వారా దిశ నిర్దేశం చేయాలని సిరిసిల్ల డీఎస్పీ కే నాగేంద్రచారి సూచించారు.
సిరిసిల్ల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రచయితలు, కవులు సమాజం కంటే ముందుండి తమ రచనల ద్వారా దిశ నిర్దేశం చేయాలని సిరిసిల్ల డీఎస్పీ కే నాగేంద్రచారి సూచించారు. పరాభవ నామ సంవత్సరాన్ని పుర స్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ భవనంలో మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం జరి గింది. జిల్లా నుంచి తొలిసారిగా రచయిత అంకారపు రవి రూపొందిం చిన ఎన్5టీజీ లిటరేచర్ వెబ్‌సైట్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, రచయిత జూకంటి జగన్నాథం, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కొండి మల్లారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం రచయితలకంటే సమాజం ముందుకు వెళ్తోందని అందులోని ఘర్షణల ను రచయితలు అందుకోవాలన్నారు. నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా బలమైన రచనలు చేయగలుగుతారన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రచయిత లు, కవులు, కళాకారుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, తెలంగా ణ రచయితల వేదిక అధ్యక్షుడు మల్లారెడ్డిలు మాట్లాడుతూ కవులు, రచ యితలు సమాజంలో జరుగుతున్న మార్పులను గమనించాలన్నారు. కవి తాగానం చేసిన కవులను మానేరు రచయితల సంఘం అధ్యక్షుడు గెం ట్యాల భూమేష్, గౌరవ అధ్యక్షుడు టీవీ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్‌లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మంచె రేణుక శ్రీనివాస్, కవులు ఎలగొండ రవి, శోభారాణీ,మాడూరి అనిత, ధరణి, సౌమ్య, గణేష్, దేవానందం తదితరులు పాల్గొన్నారు.