ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
ABN , Publish Date - May 17 , 2026 | 12:26 AM
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మకల్ ప్రదాన రహదారిపై బీజేపి నాయకులు, రైతులు శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ రూరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మకల్ ప్రదాన రహదారిపై బీజేపి నాయకులు, రైతులు శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేట్ వెంకటేష్, రైల్వే బోర్డు సభ్యుడు పాశం తిరుపతి, అసిరి తిరుపతి, గాలిపెల్లి నారాయణ, కాల్వ రామచంద్రం, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, పోగుల సాయిచంద్, నేరెళ్ల శశి, శంకర్, సంఘం అనిల్, రాజు, రైతులు పాల్గొన్నారు.