బీఆర్‌ఎస్ హయాంలో నిలిచిపోయిన పనులు..
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:23 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11 ఏళ్లుగా మూలకుపడ్డ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభిస్తోందని వేములవా డ, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11 ఏళ్లుగా మూలకుపడ్డ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభిస్తోందని వేములవా డ, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మూలవాగుపై నిర్మిస్తున్న మూడో బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.150 కోట్ల తో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరగుతు న్నాయన్నారు. రాజన్న ఆలయాభివృద్ధి ఒక కన్ను అయి తే పట్టణాభివృద్ధిని మరో కన్నులా భావిస్తున్నామని తెలి పారు. ఆధ్యాత్మిక క్షేత్రం, టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడ మే ప్రధాన లక్ష్యంగా పనులు మొదలు పెట్టామన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై, శిలాఫల కాలకే ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయకుండా వదిలేశార ని ఆరోపించారు. 2015లో బ్రిడ్జి పనులకు భూమిపూజ చేసి ప్రజలకు, భక్తులక అందబాటులోకి తీసుకువస్తామ ని చెప్పిన గత ప్రభుత్వం మాటలు నీటమూటలను ప్రజలు గ్రహించారని గుర్తుచేశారు. ప్రజలను మభ్యపె ట్టి అధికారంలోకి రావాలని గత ప్రభుత్వం చూస్తే ప్రజ లు కర్రుకాల్చి వాతపెట్టారని విమర్శించారు. తాము అధి కారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బ్రిడ్జి పనులు ప్రారం భించి చివరి దశకు తీసుకువచ్చామని తెలిపారు. అంతే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పరిస్థితి అదేవిధం గా చేశారని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో రెండుమార్లు కూలిన పరిస్థితి పట్టణ ప్రజలు గమ నించారన్నారు. రాజన్న ఆశీస్సులతోనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇంజనీరింగ్ అధికారు లకు ప్రతిసారి సూచిస్తున్నామని, పకడ్భందీగా, అత్యంత నాణ్యత ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రతి సారి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశిస్తున్నట్లు తెలిపా రు. వీలైనంత త్వరగా రాజన్న భక్తులకు పట్టణ ప్రజల కు అందబాటులోకి తీసుకురావాలని సూచించారు. మూలవాగు నుంచి రాజన్న ఆలయ వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని, 30రోజుల వ్యవధి నుంచి 90 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మ న్ నరాల శేఖర్, కౌన్సిలర్లు ఇప్పపూల మమత-అజయ్, కొండ రాజశేఖర్, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, పీర్ మహ్మద్ నాయకులు తదితరులు ఉన్నారు.