Share News

అభివృద్ధికి అహర్నిశలు కృషి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:55 PM

అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తనను గెలిపించిన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఇప్పటికే 22 వేల కోట్ల నిధులతో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

అభివృద్ధికి అహర్నిశలు కృషి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తనను గెలిపించిన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఇప్పటికే 22 వేల కోట్ల నిధులతో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. నగరంలోని 21వ డివిజన్‌ శ్రీరాంనగర్‌కాలనీ రోడ్‌ నంబర్‌-5లో మున్సిపల్‌ సాధారణ నిధులు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్‌ను అభివృద్ధి, ఉత్సావాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రభాగాన ఉంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసికట్టుగా ఉంటూ కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సూచించారు. అనంతరం 16వ డివిజన్‌ లక్ష్మీపూర్‌, మల్కాపూర్‌లో మంచినీటి పైపులైన్‌ పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రారంభోత్సవం చేశారు.

ఫ కార్పొరేషన్‌ పరిధిలోని గణేశ్‌మండపాలకు ఉచిత విద్యుత్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేస్తున్న గణేశ్‌ మండపాలకు ఉచితంగా కరెంటును అందిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. గణేశ్‌ మండపాలకు అయ్యే విద్యుత్‌ చార్జీలను నగరపాలక సంస్థ చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, కార్పొరేటర్లు వరాల నర్సింగం, కాంతాల జగన్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్‌రావు, పర్వతాల మల్లేశం, వంగల వపన్‌కుమార్‌, నాయకులు ఎన్నం ప్రకాశ్‌, గాజ శివరాం, నాయకుడు బాస సత్యనారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:55 PM