కార్మికుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - May 02 , 2026 | 12:32 AM
అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
తంగళ్లపల్లి, మే 1 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడే పురస్కరించుకున తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని ఏటీసీ, ఐటీఐలో మేడే వేడు కలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఆది శ్రీనివాస్ ముందుగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. మేడే వేడుకలు ఆనాడు కార్మికుల హక్కుల కోసం పారాడినవారి స్ఫూర్తిగా నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల కష్టం, చెమట చుక్కలతో రూపుదిద్దుకు న్న వస్తువులను నిత్యం జీవితంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గిగ్ వర్కర్ల కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేశంలోని ఎన్నో పెద్దపెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమ వల్ల నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తుచేశారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న ఆర్టీసీలో ఉన్న సమస్యలను మూడు రోజుల్లోనే సీఎం రేవం త్‌రెడ్డి ముగింపు పలికారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసిందని వెల్లడించారు. రతన్‌టాటా కంపెనీతో ము ఖ్యమంత్రి మాట్లడి నూతన టెక్నాలజీకి అనుగుణంగా మండేపల్లి, రుద్రం గికి అడ్వాన్స్డ్ టెక్కాలజీ సెంటర్లు మంజూరు చేశారని అన్నారు.కార్మిక శాఖ ఆధ్వర్యంలో అందించే వివిధ పథకాలు వినియోగించుకోవాలని పిలుపుని చ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొనే కోర్సులు ఉన్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించా రు. వేడుకల్లో ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్న క్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ ఫోన్ చేయగా స్జేజిమీద మంత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతో మం త్రి సైతం మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలిపారు.
అందరికి గౌరవం ఇవ్వాలి..
అందరికి సమాన గౌరవం ఇవ్వాలని గాంధీజీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆయన బాటలో నడవలాని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. కార్మి కుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చి అమలు చేస్తుం దన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు కార్మిక శాఖవద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిభచూపిన సంస్థలు, ఉద్యోగులకు, విద్యార్థు లకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అలాగే ఎస్పీ మహేశ్ బి గితే మాట్లాడుతూ కార్మికులు చట్టలపై అవగాహన పెంపొందించుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ కవిత, మార్కేట్ కమిటి వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పం చ్‌లు గాధగోని సాగర్‌గౌడ్, గడ్డం రచన మధుకర్, మండల కాంగ్రెస్ అధ్య క్షుడు జల్గం వ్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.