వర్కర్ టూ ఓనర్ పథకాన్ని పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:17 AM
వర్కర్ టూఓనర్ పథకా న్ని పూర్తిచేసి కార్మికులకు అందించాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : వర్కర్ టూఓనర్ పథకా న్ని పూర్తిచేసి కార్మికులకు అందించాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం మరమగ్గాల, వార్పిన్, వైపని అను బంధ రంగాల కార్మికులందరితో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మి కులకు అందించకుండా కాలయాపన చేస్తోందన్నారు. కార్మికుల కోసం నిర్మించిన వర్‌షెడ్‌లను ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం వెంటనే వర్కర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి 1104 మం ది మరమగ్గాల కార్మికులను ఎంపిక చేసి అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరా మహిళ శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్ వైప ని అనుబంధ రంగాల కార్మికులందరికీ వర్తింపజేయాలన్నారు. అలాగే కార్మికులతో ప్రవేశపెట్టిన పదిశాతం యారన్ సబ్సిడీ వెంటనే ప్రకటించి అందించాలని, 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులను అందించాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పవర్‌లూమ్ వర్కర్స్ యూని యన్ నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేష్, ఉడు త రవి, బెజుగం సురేష్, బాస శ్రీధర్, అవధూత హరిదాసు, అన్సారి తది తరులు పాల్గొన్నారు.