Share News

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:51 AM

పాలిస్టర్‌ వస్త్రానికి యజమా నులు కూలీ పెంచి అగ్రిమెంట్‌ చేసే వరకు కార్మికుల నిరవధిక సమ్మె కొన సాగుతుందని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షు డు కోడం రమణ ప్రకటించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : పాలిస్టర్‌ వస్త్రానికి యజమా నులు కూలీ పెంచి అగ్రిమెంట్‌ చేసే వరకు కార్మికుల నిరవధిక సమ్మె కొన సాగుతుందని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షు డు కోడం రమణ ప్రకటించారు. పాలిస్టర్‌ వస్త్రానికి కూలీ పెంచాలంటూ సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం సిరి సిల్ల బీవైనగర్‌లోని చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట కార్మికులు, నా యకులు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిరిమల్లె సత్యం, కుమ్మరికుంట కిషన్‌, బెజుగం సురేష్‌, అన్నల్‌దాస్‌ గణేష్‌, నక్క దేవదాస్‌, గుండు రమేష్‌, కుడిక్యాల కనుకయ్య, గాజుల కనుకయ్య, ఎలిగేటి రాజశేఖ ర్‌, శ్రీరాం సదా నందం, బింగి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:52 AM