Share News

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:17 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదుట గ్యారేజీ యూనిట్‌ కార్మికులు ధర్నా చేపట్టారు.

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదుట గ్యారేజీ యూనిట్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. టీజీఎస్‌ ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక కార్యక్రమం లో భాగంగా సిరిసిల్ల డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ డిపో గ్యారేజ్‌ కమిటీ కన్వీనర్‌ టీవీసీ రావు, శేఖర్‌రావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదన్నారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎలక్ట్రికల్‌ బస్సులను ఆర్టీసీకి జాతీయం చేయాలన్నారు. జేఏసీ డిమాండ్లను అమలు చేయలేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్లడానికి కూడా వెనకంజ వేయమన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిపో జేఏసీ గ్యారేజీ కమిటి కో కన్వీనర్లు బీ సంతోష్‌, వి రవి, జహిద్‌హుస్సేన్‌, డెలిగెట్స్‌ కొమరయ్య, అంజనే యులు, కృష్ణ, నరేందర్‌, మల్లేశం, ఎంఎంరెడ్డి, శ్రీనివాస్‌, వేణు, గ్యారేజి కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:17 AM