కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:48 AM
వస్త్ర పరిశ్ర మల్లో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికి చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులను అందించాలని సీఐటీ యూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : వస్త్ర పరిశ్ర మల్లో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికి చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులను అందించాలని సీఐటీ యూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవై నగర్‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట బుధ వారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ధర్నా చేశా రు. చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు లేనటు వంటి అర్హులైన కార్మికులకు నుంచి వ్యక్తిగతంగా స్వీకరించిన దరఖాస్తులతో పాటు కార్డులు ఇవ్వాలంటూ చేనేత జౌళి శాఖ ఏడీకి అందించారు. ఈసందర్భంగా రమణ మాట్లా డుతూ వస్త్ర పరిశ్రమలతో పాటు అనుబంధ రంగాల పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు చాలా మందికి చేనేత గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న పెన్షన్‌కు అర్హులైనప్పటికి అన ర్హులుగా మిగిలిపోతున్నారన్నారు. అర్హులైన కార్మికులకు చేనేత జౌళిశాఖ గుర్తింపు కార్డుల ను అందించాలంటూ గతంలో అనేకసార్టు సంబంధిత అధికారు లకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించినప్పటికి గుర్తిం పుకార్డులు ఇవ్వలేదని మండిపడ్డా రు. అధికారులు 15 రోజల వరకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేకుంటే పెద్దఎత్తున అందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో యూనియన్ నాయ కులు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం చంద్రశేఖర్, సందుపట్ట పోచమల్లు, అక్రమ్, శ్రీనివాస్, ప్రకాష్, రాకే్‌ష్ తదితరులు పాల్గొన్నారు.