Share News

సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:52 PM

వైద్య సిబ్బంది, అంగన్‌ వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వైద్య సిబ్బంది, అంగన్‌ వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంజీవ య్యనగర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సంద ర్శించారు. చిన్నారులకు అందిస్తున్న టీకాల వివరాలు, అమలు తీరును, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన చిన్నారులకు నిర్దేశిత టీకాలు సమాయానికి అందేలా చూడాలని సూచిం చారు. పిల్లల ఆరోగ్య రక్షణలో టీకాల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివ రించాలని టీకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం స్థానిక కనకదుర్గ కంటి ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోగ్రామ్‌ ఆఫీసర్స్‌ సంపత్‌ కుమార్‌, మహేష్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:52 PM