Share News

ఘనంగా మహిళా వారోత్సవాలు

ABN , Publish Date - May 24 , 2026 | 12:13 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25వ తేదీని నుంచి 30వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాలను ఘనంగా చేపట్టి విజయ వంతం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

ఘనంగా మహిళా వారోత్సవాలు

సిరిసిల్ల అర్బన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25వ తేదీని నుంచి 30వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాలను ఘనంగా చేపట్టి విజయ వంతం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మహిళా వారోత్సవాలపై మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ మహిళా వారోత్సవాల సందర్భంగా రోజూ వారీగా కార్యక్ర మాలను సమర్థవంతంగా నిర్వహించాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈనెల 25న పోషకాహార మిషన్‌ కార్యక్రమంలో భాగంగా పోషకాహార వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేసి, సే నో టూ జంక్‌ ఫుడ్‌లపై అవగాహన, వంటల పోటీలతో పాటు గర్భి ణులకు రక్తహీనత పరీక్షలు చేయడం చేపట్టాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం చేపడు తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. 26న బాల్య వివా హాల నిర్మూలన తెలంగాణ లక్ష్యంగా బాల్య వివాహం- బతుకు ఆగం పేరుతో బాల్య వివాహాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వ హించి, పోస్టర్‌లు, కరపత్రాలతోపాటు గోడలపై చిత్రలేఖనం, తదితర ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి, మత పెద్దలు, కల్యాణ మండపాల నిర్వా హకులతో సమావేశాలు నిర్వహించి 1098, 181 సేవలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే నూతన మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి పాస్‌ బుక్‌లు అందజేసి, సన్మానం చేయాలని ఆదేశించారు. 27న మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు, షీ టీంల సమన్వయం, కార్యాలయాల్లో పోస్‌ నిబంధ నల అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులకు లోన్‌ మేళా నిర్వహించాలని సూచించారు. అలాగే 29న జిల్లాలో నూతన అంగన్‌వాడీ కేంద్రాలు, వీవో భవనాలు, మెప్మా ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో క్యాంటీన్‌ ప్రారంభించాలని సూచిం చారు. 30న ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ పేరుతో అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల నిండిన పిల్లలకు ప్రాథమిక పాఠశాలకు పంపించడానికి విద్యారంభ్‌ సర్టిఫికెట్లు అందజేయాలని అలాగే సూచించారు. అలాగే కొత్తగా అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త పిల్లల్ని చేర్చుకోవడం, పిల్లల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:13 AM