మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:02 AM
మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంన గర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే కరీంన గర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలం లోని వివిధ గ్రామాల్లో శనివారం పలు అభివృద్ధి పనుల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాపూర్, అనంతపల్లి, కోరెం, స్తంభంపల్లి, విలాసాగర్, కొదురుపాక గ్రామాల్లో వివోఏల నూతన భవనా లకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. బోయినపల్లిలో ఎమ్మెల్యే నూతన గిడ్డంగి(గోదాం) నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బీసీ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్‌లూమ్ మ్యాక్ సొసైటీ బతుకమ్మ చీరల కేంద్రాన్ని సందర్శించి కార్మికుల, నేతన్నల పనితీరును పరిశీలిం చారు. నేతన్నలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఈ సందర్భంగా భరోస కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముందుగంటి సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, వైస్‌చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, సర్పంచ్‌లు బింరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, నల్ల మోహన్, సుద్దాల మధు, నాయకులు వన్నెల రమణారెడ్డి రెడ్డి, నాగుల వంశీ, సంభ లక్షీరాజం, తదితరులు పాల్గొన్నారు.