Share News

పార్లమెంట్‌లో మహిళా బిల్లు చరిత్రాత్మకం..

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:10 AM

పార్లమెంట్‌లో 33 శాతం మహి ళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చరిత్రత్మాకమని భారతీ య జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి రెడ్డి అన్నారు.

పార్లమెంట్‌లో మహిళా బిల్లు చరిత్రాత్మకం..

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌లో 33 శాతం మహి ళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చరిత్రత్మాకమని భారతీ య జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తి రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణం లో గురువారం సాయంత్రం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్య క్షుడు రెడ్డబోయిన గోపి నేతృత్వంలో పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి బతుక మ్మఘాట్‌ వరకు నారీశక్తి వందన్‌ ర్యాలీని నిర్వహించారు. అనంతరం బతుక మ్మ ఘాట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కీర్తిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై సమాన్వతం ఉండేలా బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు అమలుకు శ్రీకారం చుట్టడం మహిళలకు దక్కిన గౌరవమన్నారు. బీజేపీ ప్రభుత్వం అఽధికా రంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంతో దేశంలో మహిళ లను ఉన్నత హోదా కల్పించారని స్పష్టం చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు గౌరవం దక్కలేదన్నారు. ఈ మహిళా బిల్లుతో డీ లిమి టేషన్‌తో చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు రాజకీయంగా ఎదుగుతారని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని దీప, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసి పల్లం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 03:10 AM