Share News

గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:08 AM

కథలాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధిలో మహిళా స్వశక్తి సంఘాల పాత్ర ఎంతో కీలకమని, పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని చింతకుంట, పోసానిపేట గ్రామాల్లో రూ.30 లక్షలతో నిర్మించనున్న స్వశక్తి సంఘ భవనాల భూమిపూజ కార్యక్రమంతో పాటు రాజారాం తండా నూతన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాల పాత్ర కీలకం
రాజారాం తండా నూతన గ్రామ పంచాయతీని ప్రారంభిస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధిలో మహిళా స్వశక్తి సంఘాల పాత్ర ఎంతో కీలకమని, పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని చింతకుంట, పోసానిపేట గ్రామాల్లో రూ.30 లక్షలతో నిర్మించనున్న స్వశక్తి సంఘ భవనాల భూమిపూజ కార్యక్రమంతో పాటు రాజారాం తండా నూతన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కారు మహిళల స్వయం సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ మౌళిక సదుపాయాలను అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, గ్రామాల్లో ఉన్న ప్రతీ గ్రామైఖ్య సంఘంకు నూతన భవనాలు నిర్మించడానికి సర్కారు చిత్తశుద్దితో ఉందన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడి రైతాంగం ఎదిరిచూస్తున్న కలికోట సూరమ్మ చెరువు పనులు శరవేగంగా సాగుతున్నాయని కుడి, ఎడమ కాలువల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని అన్నారు. రాళ్ళవాగు కుడి కాలువకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామాల్లో వేగంగా కొనసాగుతున్నాయని సొంతింటి కల పేదలకు నెరవేరుతోందన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే అందించామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆకుల సుజాతరాజేంధర్‌, తిరుపతినాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ పూండ్ర నారాయణరెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు న్యావనంది శేఖర్‌, జిల్లా మున్నూరుకాపు సంఘ అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ బైర హేమలతమల్లేశ్‌, పులి హరిప్రసాద్‌, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:09 AM