మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ABN , Publish Date - May 29 , 2026 | 11:57 PM
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సీడీపీవో సబిత అన్నారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ చామనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రిషన్ వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు.
కరీంనగర్ రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సీడీపీవో సబిత అన్నారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ చామనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రిషన్ వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు చాలాచురుకుగా ఉన్నారని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని తెలిపారు. పీహెచ్‌సీల్లో మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొగొండ ఐలయ్య, కార్యదర్శి మహేందర్ రావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజమణి, డీపీఎ రోమిలా, సతీష్ పాల్గొన్నారు.