Share News

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:49 PM

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జడ్పీ డిప్యూటీ సీఈవో గీత అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డిప్యూటీ సీఈవో గీత అన్నారు. శుక్రవారం స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌(ఎస్టీయూ) ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినో త్సవం వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రం గ్రంథాలయం సమావేశ మందిరంలో 40 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ముఖ్య అతిథి డిప్యూటీ సీవో గీత సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రేవోజు సదానందం, ప్రధాన కార్యదర్శి మొగిలి లక్ష్మణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని సత్యనారాయణగౌడ్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు అరకుటి మల్లేశం, కోశాధికారి బొగ్గరపు నవీన్‌, రాష్ట్ర కార్యదర్శులు చాట్ల మల్లేశం, గోపి, ప్రశాంత్‌, రాజేష్‌, రాజయ్య, అని ల్‌, శ్రీనివాస్‌, వివిధ మండలాల ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:49 PM