Share News

మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:58 PM

మహిళ లు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : మహిళ లు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృ ద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమ శాఖ అధ్వర్యంలో మహి ళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్నిప్రారంబించారు. వివిధ రం గాల్లో ప్రతిభ చూపిన మహిళలు, మహిళా ఉద్యోగులను సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచ క్రపాణి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా సంక్షేమాధికారిలక్ష్మీరాజం, జిల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్‌డీవో గీతా, వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, మైనార్టీ సంక్షే మాధికారి ఎంఏ భారతి, ఎస్పీ సంక్షేమాధికారి స్వప్న, పశుసంవర్థక శాఖఅధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

‘రేవంతన్న కా సహార మిస్కిన్‌’ను సద్వినియోగం చేసుకోవాలి

రేవంతన్నా కా సహార మిస్కీన్‌ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మైనార్టీల సంక్షేమ కోసం మైనారీటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేవంతన్నాకా సహార మిస్కీన్‌ల పథకానికి లబ్ధిదారులను కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. జిల్లాలోని పఖీర్‌, దూదేకుల, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ అభ్యు న్నతి సంక్షేమ కోసం మోపెడ్‌లు, బైక్‌లు, ఈ బైక్‌లను అందించేందుకు జిల్లా కేటాయించిన ఐదు యూనిట్లకు ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక జిల్లా స్ర్కీనింగ్‌ కం సెలక్షన్‌ కమిటీ సభ్యుల సమక్షంలో ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎంఏ భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:58 PM