మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:16 AM
మహిళ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : మహిళ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యం అన్నారు. ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా బోయి నపల్లిలో శీధరిత్రి, శ్రీలక్ష్మీ తులసి గ్రామైక్య సంఘాల భావన నిర్మాణా లకు బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శిలాఫలకాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజక వర్గంలోని మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభ ుత్వం కృషి చేస్తోందన్నారు. అంతేకాకుండా మండల జాగృతికి రూ.45 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. అంతరం బూర్గుపల్లి గ్రామంలో రూ.5లక్షల నిధులతో సిమెంట్‌రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. కొదురుపాక గ్రామానికి చెందిన వికలాం గుడు పెంజర్ల బాలరాజుకు ప్రభుత్వం తరపున ఎలక్ర్టిక్ స్కూటీనీ పం పిణీ చేశారు. ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న క్యాటిల్ షెడ్స్, ఫౌలీ్ట్రఫాం లబ్ధిదారులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఏం గీత, ఎంపీడీవో జయశీల, సెస్‌చైర్మన్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, సర్పంచ్‌లు బింరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, నల్ల మోహన్ సుద్దాల మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డిరెడ్డి, నాయకులు లక్ష్మీరాజం, సువిన్‌యాదవ్, వంశీగౌడ్ పాల్గొన్నారు.