పౌష్టికాహార లోపంతో మహిళ లు అనారోగ్యం
ABN , Publish Date - May 25 , 2026 | 11:59 PM
పౌష్టికాహార లోపంతో చాలా మంది మహిళ లు అనారోగ్యం పాలవుతున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి) : పౌష్టికాహార లోపంతో చాలా మంది మహిళ లు అనారోగ్యం పాలవుతున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజా పాలన-ప్ర గతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగం గా మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్స వాలను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచ క్రపాణి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌లకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఆరోగ్యం పై మహిళలు నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్యల క్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వైద్యుల సలహాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రి డాక్టర్ రజిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం, కౌన్సిలర్లు కూర భాగ్యలక్ష్మి, మెప్మా ఏవో ఫసహత్ ఆలీబేగ్, వైద్యులు, సిబ్బంది, మహిలలు పాల్గొన్నారు.