గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:33 AM
యువత క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో గెలుపో టములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు.
రుద్రంగి, జనవరి 11(ఆంధ్రజ్యోతి) : యువత క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో గెలుపో టములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు. రుద్రంగి మండలం దిగావత్ తండాలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటీవ్ యూనియన్ చైర్మెన్ మానాల మోహన్‌రెడ్డితో కలిసి పోటీలను తిలకించారు. అనం తరం ఫైనల్ కబడ్డీ మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్‌కమిటీ చైర్మెన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, జక్కు మోహన్, జక్కుల లక్ష్మినారాయణ, తిక్క భూమయ్య, తర్రె లింగం, జక్కు వంశి, దిలీప్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచా యతీ కార్యాలయంలో అర్హులైన 21 మంది లబ్ధిదారులకు 7లక్షల 91వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధా న్యతనిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యు త్, రూ.500లకే సిలిండర్, రుణమాఫీ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామ న్నారు. మన ప్రాంతంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు ఎల్‌వోసీల ద్వారా 20కోట్లపై చిలుకు మంజూరుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమి టీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి,ఎర్రం గంగ నర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, ఎర్రం అరవింద్, పున్నూరు శ్రీనివాస్, పల్లి గంగాధర్, పుట్టుకుపు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.