Share News

‘యావర్‌ రోడ్డు విస్తరణకు సహకారం అందిస్తా’

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:52 AM

జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్‌ రోడ్డు విస్తరణకు, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన నిర్మాణానికి అవసరమైన సహకారం తప్పక అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

‘యావర్‌ రోడ్డు విస్తరణకు సహకారం అందిస్తా’
సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్‌ రోడ్డు విస్తరణకు, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన నిర్మాణానికి అవసరమైన సహకారం తప్పక అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మండలం గుమ్లాపూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి బాట బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి తన ప్రసంగంలో జగిత్యాల జిల్లా యావర్‌ రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన నిర్మాణాల అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి కొరకు నిధులు, సంక్షేమ పథకాలను సాధించుకునే అభ్యర్థులను గెలిపించాలని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అభివృద్ధి కొరకు తనకు వినతిపత్రం అందించారని వెల్లడించారు. యావర్‌ రోడ్డును తప్పకుండా విస్తరిస్తామని, వాలంతరీ స్థలంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం ఏర్పాటు ప్రతిపాదనను కూడా అమలు చేస్తానని స్పష్టంచేశారు. కాగా జగిత్యాల యావర్‌ రోడ్డు విస్తరణకు, ఇతర అభివృద్ధి పనులకు సహకరిస్తానని హామీనివ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 06 , 2026 | 12:52 AM