పారదర్శకంగా జరిగేనా..?
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:12 AM
శాతవాహన విశ్వవిద్యాలయంలో త్వరలో 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రెగ్యులర్ పోస్ట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన, ఇతర పోస్ట్లున్నాయి.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు పారదర్శకంగా జరగాలి. నియామక ప్రకియ్రలో అవకతవకలు జరిగినా లేదా చిన్నతప్పు చోటు చేసుకున్నా కఠిన చర్యలుంటాయి.
- ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలకు రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు
- సెప్టెంబరు 9న కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు 21 మంది నుంచి 44 లక్షలు వసూలు చేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల పోస్ట్‌కు సంబంధించి నకిలీ నియామక పత్రాలిచ్చిన మోసగాళ్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.
- 2024లో ఇదే శాతవాహన యూనివర్సిటీలో 2022 నుంచి భర్తీ చేసిన ఔట్సోర్సింగ్, ఇతర ఒప్పంద ఉద్యోగుల నియామకాలకు సంబంధించి విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పైరవీలతో పలువురికి పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లు సాగిన ఈ విచారణ అటకెక్కింది.
శాతవాహన విశ్వవిద్యాలయంలో త్వరలో 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రెగ్యులర్ పోస్ట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన, ఇతర పోస్ట్లున్నాయి. యూనివర్సిటీ కార్యవర్గం త్వరలో సమావేశమై రోస్టర్ విధానాన్ని ప్రకటిస్తుంది. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా 1:10 నిష్పత్తిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎంపిక చేస్తారు. తర్వాత యూనివర్సిటీలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ ఇంటర్వూల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఈసారి పూర్తిగా ఇంటర్వ్యూ ప్రకియ్రను వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతవిద్యామండలి ఆదేశించింది. గతంలో శాతవాహన యూనివర్సిటీలో నియామకాలు గందరగోళంగా చేపట్టారని అప్పటి వీసీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పూర్తిగా పైరవీకారులకే ప్రాధాన్యమిచ్చారనే అభియోగాలను యూనివర్సిటీ ఎదుర్కొంది. ఔట్సోర్సింగ్ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారనే అభియోగాలు వెల్లువెత్తాయి.
ఫ గతంలో ఇష్టానుసారంగా..?
ఈ నెలలో తొమ్మిది పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన వెలువడింది. ఈ నెల 31 చివరి గడువు. వీటి కోసం అర్హులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది యూనివర్సిటీలో 35 పోస్ట్‌లను లోలోపల భర్తీ చేశారనే విమర్శలు వినిపించాయి. 2022-23 సంవత్సరంలోనూ కొన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఎలాంటి అనుమతులు లేకుండా యూనివర్సిటీ పరిధిలో ఇష్టానుసారంగా భర్తీ చేశారనే విమర్శలు వచ్చాయి. పైరవీలు చేసుకుని, పోస్ట్కింత అని డబ్బులు చెల్లించాలని కొందరు బేరాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈసారి పోస్టుల భర్తీ విషయంలో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరముంది.