పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:48 AM
పార్టీ ఫిరాయింపు ఆరోపణల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని, దానిపై స్పీకర్ గాని, న్యాయస్థానం గాని తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపు ఆరోపణల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందని, దానిపై స్పీకర్ గాని, న్యాయస్థానం గాని తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం జగిత్యాలలో విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి పని చేయటంపై చట్టానికి జవాబు ఇస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నూకపల్లి డబల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాకే రూ.34 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. నరికేస్తా, తొక్కేస్తా, చంపేస్తా అని ఇటీవల జగిత్యాలలో కొందరు వ్యాఖ్యాని స్తున్నారని, ప్రజలు అభివృద్ధి కోరుకుంటారని, హత్యా రాజకీయాలు కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలి చారన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, తర్వాత రాజకీయ పరిణామాల్లో నాదేండ్ల భాస్కర్ రావుతో కలిసి పనిచేసింది ఎవరని ప్రశ్నించారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఎన్ని నెలలు జెండా మోస్తే గతంలో టీడీపీ టికెట్ వచ్చిందని ఎమ్మెల్యే నిలదీశారు. టీడీపీ నుంచి పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌ను గతంలో జీవన్‌రెడ్డి తీసుకున్నారని ఆరోపించా రు. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్న మాది రిగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జగిత్యా ల అభివృద్ధి కోసం కలవగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అసత్య ఆరోపణలు చేసి, కార్యకర్తల ను రెచ్చగొట్టి తన ఇల్లు, హాస్పిటల్‌పై దాడి చేయించారని ఆరోపించారు. విద్యాసాగర్ రావు గతంలో పార్టీలను వీడలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించి న ఆరోపణలపై విద్యాసాగర్‌రావును పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం ప్రజలకు తెలిసిందే అన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలుగురి దామోదర్ రావు, సీనియర్ నాయకులు గట్టు సతీష్, అడువాల లక్ష్మణ్, కూసరి అనిల్, తోట మల్లికార్జున్, బొడ్ల జగదీష్, దుమాల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.