Share News

వన్య ప్రాణులను సంరక్షించాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:09 AM

వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి బాపురాజు అన్నారు.

వన్య ప్రాణులను సంరక్షించాలి
వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ అధికారులు

గంగాధర, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి బాపురాజు అన్నారు. మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు మంగళవారం ఆటలు నిర్వహించి వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను సంరక్షించుకోవాలని, అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గంకిడి సంధ్యరామచంద్రారెడ్డి, ఉపసర్పంచ్‌ ఆసిఫ్‌, కార్యదర్శి జయకర్‌రెడ్డి, సెక్షన్‌ ఆఫీసర్‌ అనంతరామ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:09 AM