డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:06 AM
డ్రగ్స్ వినియోగం తో వచ్చే దుష్ప్రభావాలపై విస్తృతం గా ప్రచారం చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్ వినియోగం తో వచ్చే దుష్ప్రభావాలపై విస్తృతం గా ప్రచారం చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అదేశించారు. కలెక్టరేట్‌లోని అదనపుకలెక్టర్ ఛాం బర్‌లో మంగళవారం జిల్లాలోని మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్ర ణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థా యి నార్కోటిక్ కంట్రోల్ సమావేశా న్ని నిర్వహించారు. జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీ ఎస్ కేసులు,గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రచారం చేపట్టాల్సిన అం శాలపై చర్చించారు. అనంతరం అదనపు కలె క్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యా ల రవాణా, సాగు, వినియోగం నివారణపై ప్ర త్యేక దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసర మైన చికిత్స, కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికా రులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని, డ్రగ్స్ బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్ పూర్తి స్థాయిలో అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్ర య్య మాట్లాడుతూ.. గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో డ్రగ్స్ గంజాయివల్ల కలిగే నష్టాల పై పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ, వైద్య శాఖ ఆధ్వ ర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. వివిధ షాపుల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల, వేముల వాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంప త్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్‌అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్ష కులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.