ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:13 AM
ఎయిడ్స్ నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిం చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్ నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిం చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం రాజన్న సిరి సిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎయిడ్స్ నియం త్రణపై వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, విద్య, యువజన శాఖ, జడ్పీ సీఈవో తదితర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు. జిల్లాలో ఎయిడ్స్ పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, వారు ఎక్క డ వైద్య సేవలు పొందుతున్నారు, మందులు, కౌన్సెలింగ్ తదితర సేవ లు ఎక్కడ పొందుతున్నారని ఆరా తీశారు. జిల్లాలో 1283 పాజిటివ్ కేసులు ఉన్నాయని, వారికి నెలనెలా మందులు అందిస్తున్నామని అధి కారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయాలని, రోగులకు నిరంతరం వైద్యం, మందులు, కౌన్సెలిం గ్ చేయాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పాజిటివ్ కేసులు వచ్చిన చోట పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వ హించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు షెడ్యూల్ సిద్ధం చేయాలని, దాని ప్రకారం పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. యువత, విద్యార్థులకు అవగాహన సమావేశాలు, పోటీలు నిర్వహించా లని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట మాధవ రావు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, జీజీ హెచ్ సూపరింటెండెం ట్ ప్రవీణ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, యువజ న క్రీడల శాఖ అధికారి రాందాస్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.