గెలుపెవరిదో...?
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:40 AM
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ఆరంభం కానున్నది. మున్సిపాలిటీల్లో 12 గంటల లోపే కౌంటింగ్ పూర్తి కానుండగా, కార్పొరే షన్‌లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి కానున్నాయి. గెలుపోటములపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా, వారి భవితవ్యం శుక్రవారం తేలనున్నది. ఫలితాలు ప్రకటించిన వెంటనే గెలిచిన అభ్యర్థులు ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్ కౌంటింగ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లి కౌంటింగ్ పెద్దకల్వలలోని మథర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, సుల్తానాబాద్, మంథని ఎన్నికల కౌంటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టనున్నారు. ఈ మేరకు సహాయ ఎన్నికల అధికా రులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగగా, నాలుగింటిలో కలిపి 70.33 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం కార్పొరేష న్‌లో 1,24,520 ఓట్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలో 32,201 ఓట్లు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 13,716 ఓట్లు, మంథని మున్సిపాలిటీలో 11,056 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కౌం టింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత బ్యాలెట్ బాక్కుల్లో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో డివిజన్, వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ల బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత ఆ కట్టలను అభ్యర్థులకు పడిన ఓట్లను వేరు చేసి అభ్యర్థుల వారీగా ఉన్న టేబుల్ బాక్సుల్లో వేసి 25 చొప్పున కట్టలు కట్టి కౌంటింగ్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో మొత్తం ఫలితాలు వెలువడ నున్నాయి. జిల్లాలో గల నాలుగింటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే మెజారిటీ స్థానాలను దక్కించుకునే అవకాశాలున్నాయి. అన్ని చోట్ల పీఠాలను దక్కించుకు నేందుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ దక్కే అవ కాశాలున్నాయి. గెలుపొందిన అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచి క్యాంపులకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు లగేజీతో సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు పార్టీ నాయ కులు సమాచారం అందించారు. ఈ నెల 16వ తేదీన 11 గంటలకు ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించి, మఽధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకో నున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పరిస్థి తులను బట్టి సదరు ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ఏదో ఒక కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.