సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన విప్
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:21 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభ, పార్కింగ్ స్థలాలను శుక్రవారం ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ మహేష్ బిగీతేతో కలిసి పరిశీలించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభ, పార్కింగ్ స్థలాలను శుక్రవారం ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ మహేష్ బిగీతేతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు హాజర య్యే క్రమంలో పట్టణంలోకి ప్రవేశించే మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రత్యేకంగా పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా, చంద్రంపేట చౌరస్తా ప్రాంతాలను పరిశీలించి, ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భారీ సంఖ్య లో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.