Share News

నిర్వాసితులకు ఇచ్చిన హామీల అమలేది?

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:11 AM

మిడ్‌ మానేరు నిర్వాసిత కుటుంబాల కు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు ఏమైందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతు న్నా సమస్యలు ఎందుకు పరష్కరించడం లేద ని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు.

నిర్వాసితులకు ఇచ్చిన హామీల అమలేది?

వేములవాడ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మిడ్‌ మానేరు నిర్వాసిత కుటుంబాల కు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు ఏమైందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతు న్నా సమస్యలు ఎందుకు పరష్కరించడం లేద ని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. వేములవాడ అర్బన్‌ మండలం అనుపురంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కోసం వేలాది కుటుంబాలు, ఇళ్లు, భూములు, ఆస్తులను త్యాగం చేశారన్నారు. మిడ్‌ మానేరు నిర్వాసిత కుటుంబాలు మొత్తం 10,683ఉండగా, అందులో ఇప్పటివరకు 5,987 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకున్నారని, మిగతా 4,696కుటుంబాలు సొంత ఇళ్లు లేక ఇబ్బందు లు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిర్వాసితులకు రూ. 270 కోట్లు మంజూరు చేస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చి న ప్రకటన ఏమైందన్నారు. 2019లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముంపు గ్రామాలకు వచ్చి న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, పొన్నం ప్రభా కర్‌, ఆది శ్రీనివాస్‌ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని హామీచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ప్రజల కోసం పోరాడుతామని, అవసరమైతే లాఠీదెబ్బ లు తింటామని చెప్పి నిర్వాసితుల సమస్యలను పక్కదా రి పట్టించారని విమ ర్శించారు. సీఎం సిరి సిల్ల పర్యటనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైన ఉందని సూచిం చారు. ముంపు గ్రామాల్లో యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ని కూడా చల్మెడ ప్రస్తావించారు. జిల్లావ్యాప్తం గా ఉన్న ముంపు గ్రామాల్లో మిగిలిన పరిహా రం, ఇళ్ల పట్టాలు, ఫ్యాకేజీ అందజేతపై చిత్తశు ద్ధితో వ్యవహరించి సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపాలని అన్నారు. ఈ సమావేశం లో నాయకులు మ్యాకల రవి, కొండయ్య, రంగు రాములు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:11 AM