స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ..?
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:54 AM
విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రశ్నించారు.
గణేశ్‌నగర్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఖాళీ పర్సులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్‌నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోత్స్న, నగర నాయకులు సందీప్‌రెడ్డి, బోయినివిష్ణు, అరవింద్, సాయికృష్ణ పాల్గొన్నారు.