Share News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభమెప్పుడో?

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:48 PM

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య కేంద్రాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభమెప్పుడో?

గంభీరావుపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య కేంద్రాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో ప్రజలకు వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లక్షణంగా వదిలేశారు. నిర్మించి ఏడాది దాటినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రజలకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రి అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. ఆధునాతన హంగులతో నిర్మించిన పీహెచ్‌సీ ఉపయోగంలోకి రాక నిరుపయోగంగా ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది. రోగుల సౌకర్యాలకు అనుగు ణంగా విశాలమైన గదులు, పరీక్ష గదులు, ల్యాబ్‌లు, ఫార్మా గధులు నిర్మించారు. గంభీ రావుపేట పీహెచ్‌సీ నూతన భవనం ప్రారంభంలో జాప్యంతో ఇక్కడ పనిచేసే కొందరు వైద్య సిబ్బంది లింగన్నపేట పీహెచ్‌సీలో విధులు నిర్వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా పీహెచ్‌సీ ప్రారంభంలో జాప్యానికి ఫర్నీచర్‌ సమస్యే ప్రధాన కారణంగా తెలు స్తోంది. ఏది ఏమౖనా ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవాలనే సంక ల్పంతో కోటిన్నర రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తొందరగా ఆసుపత్రిని ప్రారంభించి, వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరారు.

Updated Date - Jul 19 , 2026 | 11:48 PM