Share News

కో-ఆప్షన్‌ నియామకాలకు మోక్షం ఎప్పుడు

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:15 AM

గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కో-ఆప్షన్‌ సభ్యుల నియామకాలు చేపట్టకపోవడంతో ఆ పద వులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.

కో-ఆప్షన్‌ నియామకాలకు   మోక్షం ఎప్పుడు

- పంచాయతీ ఎన్నికలు జరిగి నాలుగు మాసాలు

- ఒక్కో పంచాయతీకి ముగ్గురు సభ్యులు

- ఎదురుచూస్తున్న ఆశావహులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కో-ఆప్షన్‌ సభ్యుల నియామకాలు చేపట్టకపోవడంతో ఆ పద వులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. గడిచిన డిసెంబర్‌లోనే మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, నామినేషన్ల తిరస్కరణ విషయంలో ఒక అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో రామగిరి మండలం పెద్దంపేట్‌ పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. దానిపై ఇంకా నిర్ణయం వెలువడ లేదు. ఎన్నికలు జరిగిన 262 గ్రామ పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి ముగ్గురు చొప్పున 786 మంది కో ఆప్షన్‌ సభ్యులను నియమించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన నెల, రెండు నెలల్లోనే కోఆప్షన్‌ సభ్యుల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దాని ఊసెత్తడం లేదు.

ఫ ఒక్కో పంచాయతీల్లో ముగ్గురు సభ్యులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018లో గ్రామ పాలక వర్గాలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కోఆప్షన్‌ సభ్యులను నియమించేందుకు అవకాశం కల్పించింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులను నియమించాలి. నియామక మయ్యే వారికి పంచాయతీ వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. సాధారణంగా మున్సిపల్‌ కార్పొరే షన్లు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్‌ల్లో కో ఆప్షన్లను ఎన్నుకునే వాళ్లు. పంచాయతీల్లోనూ కోఆప్షన్‌ సభ్యులు ఉండాలనే ఉద్ధేశ్యంతో 2018లో అమల్లోకి తీసుకవచ్చారు. గతంలో కోఆప్షన్‌ పదవులకు మైనార్టీ లకు దక్కేవి. వాటిలో సవరణలు తీసుకవచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం మార్గదర్శకంగా సూచనలు, సలహాలు ఇచ్చే వారిని నియమించాలని చట్టంలో పేర్కొ న్నారు. కోఆప్షన్‌ సభ్యులుగా ఒకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఒకరు ప్రభుత్వ కార్యకలాపాలు, జీవోలు, పాలనాపరమైన ఇంశాలపై పట్టు కలిగిన ఉద్యోగ విర మణ చేసిన ఉద్యోగిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరొకరు పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన వారు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ఎన్‌ఆర్‌ఐలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికలో సర్పంచ్‌ కీలకంగా వ్యవహరిం చనున్నారు. కొన్ని పంచాయతీల్లో ఎమ్మెల్యే నిర్ణయం కీలకం కానుంది.

ఫ కో-ఆప్షన్‌ సభ్యులకు ప్రత్యేక స్థానం..

కో-ఆప్షన్‌ సభ్యులకు గ్రామ సభల్లోనూ, పంచాయతీ సమావేశాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా ప్రొటోకాల్‌ ఉంటుంది. గ్రామా భివృద్ధికి వారు ఇచ్చే సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఏదైనా అంశంపై తీర్మానం చేసేటప్పుడు ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు. కేవలం పంచా యతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో కోఆప్షన్‌ సభ్యుల పాత్ర కీలకం కానుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగిన ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, నాలుగు నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం వాటి ఊసేత్తక పోవ డం గమనార్హం. పంచాయతీల్లో ముఖ్యంగా పెద్ద పంచాయతీల్లో ఈ పదవుల కోసం ఆశలు పెంచుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఎప్పుడు కో-ఆప్షన్‌ పదవుల నియామక ప్రక్రియ ప్రారంభమ వుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 02:15 AM