Share News

సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:22 AM

ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 8, 9 వార్డులకు చెందిన యువకులు పార్టీలో చేరగా వారికి సంగీతం శ్రీనివాస్‌ కండువాలు కప్పి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తున్నారన్నారు. ప్రజా పాలనలో అమలు అవుతున్న సంక్షేమ పథాకాలకు యువత ఆకర్షి తులు అవుతూ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగు తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి పను లలో అందరు భాగస్వామ్యులు కావాలన్నారు. ఏఐ సీసీ, టీపీసీసీ, డీసీసీ ఏ పిలుపునిచ్చినా కార్యకర్తలు, పార్టీలో చేరుతున్న యువకులు ముందుండాలని అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ బలోపేతంకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాల రాజు, నాయకులు బడుగు భరత్‌, నాగరాజు, రజనీ కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:22 AM