Share News

రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:48 AM

దేశం కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణతర్పణం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ మాకందరికీ స్పూర్తిప్రధాత అని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు.

రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు
రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్న మంత్రి పొన్నం, అడ్లూరి, ఎమ్మెల్యేలు నాయకులు

కరీంనగర్‌ టౌన, జూన 5 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణతర్పణం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ మాకందరికీ స్పూర్తిప్రధాత అని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని టీపీసీసీ చైర్మన మహేశకుమార్‌గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మనకుమార్‌ లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేశ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ యువత ప్రపంచ దేశాలతో పోటీపడాలనే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని అన్నారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టెలికాం రంగ అభివృద్ధికి ఆయన పునాది వేశారని అన్నారు. రాజీవ్‌గాంధీ, ఇందిరా గాంధీ త్యాగస్ఫూర్తిని యువ త ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు రోజులు దగ్గరపడ్డాయి. ఆ పార్టీలకు భవిష్యత లేదని కరీంనగర్‌ గడ్డమీద నుంచి చెబుతున్నా... ప్రజలకు కావలసిం ది, కుల మత విద్వేషాలు కాదు.. శాంతిభద్రతలు, విద్య, ఉద్యోగాలు, జీవిత బాగోగులని అన్నారు. కుల, మతాలతో విద్వేషాలను పెంచారని బీజేపీపై నిప్పు లు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన మాటలను బీజేపీ పూర్తిగా మరిచిపోయిందని విమర్శించారు. రాజీవ్‌ గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో సీఎం రేవంతరెడ్డి నేతృత్వం లోని ప్రజాప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగాలకల్పనకు కృషి చేస్తుందని అన్నారు. దేవుళ్లను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ధ్వజ మెత్తారు. రాజీవ్‌గాంధీ అయోధ్య రామాలయానికి శిలాన్యాసం చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. టెలికాం రంగానికి ఆజ్యం పోయడంతోనే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు మన దేశంలో వినియోగిస్తున్నామని అన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తిగా పేద ప్రజల సంక్షేమ, అభివృద్ధి, విద్య, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని మహేశకుమార్‌గౌడ్‌ అన్నారు.

రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ అనేక పోరాటాల మధ్య 1994లో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కాంస్య విగ్రహా న్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలను ప్రధానిగా తీసుకువచ్చారని కొనియాడారు. టీపీసీసీ చైర్మన మహేశకుమార్‌గౌడ్‌, మిగతా 8వ పేజీలో

Updated Date - Jun 06 , 2026 | 12:48 AM