సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:21 AM
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని బీజేపీ జాతీయ నాయకుడు పోల్సాని మురళీధర్‌రావు కోరారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని బీజేపీ జాతీయ నాయకుడు పోల్సాని మురళీధర్‌రావు కోరారు. సిరిసిల్ల పట్టణంలో బుధవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబి రాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా మురళీధర్‌రావు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రశిక్షణ శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి పండిట్ దీన్‌దయాళ్, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా జాతీయ పునర్నిర్మాణానికి అంకితమైన ఉద్యమంగా ఎదిగిందని పేర్కొ న్నారు. సిద్ధాంతాలు, విలువలు, క్రమశిక్షణ, సేవా భావం ఆధారంగా పార్టీ కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. బీజేపీ చరిత్ర, వికాసం, సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన ప్రతి కార్యకర్తకు ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై విశిష్ట స్థానాన్ని సంపాదించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపుని చ్చారు. దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను అర్థం చేసుకొని ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయగల నాయకత్వాన్ని కార్యకర్తలు పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శిక్షణా తరగతులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమా లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదప డుతుందన్నారు. రెండు రోజుల శిబిరంలో బీజేపీ సిద్ధాంతం, పార్టీ చరి త్ర, వికాసం, భారత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, కార్య కర్తల బాధ్యతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథ కాలు, సోషల్‌మీడియా వినియోగం, సమర్థవంతమైన ప్రజా సంబంధా లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులు పార్టీ సీనియర్ నాయకులు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు, జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్య దర్శులు సిరికొండ శ్రీనివాస్, కరెడ్ల మధుకర్, నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, అల్లాడి రమేష్, కుమ్మరి శంకర్, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి చంటి మహేష్, కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ ఆడేపు రవీందర్, శీలం రాజు, ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, మేర్గు హనుమంత్‌గౌడ్, దశరథం రెడ్డి, జిల్లా పదాధికా రులు, పలు మండలాల అధ్యక్షులు, మండల పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.