ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:40 PM
కొత్త సంవత్సరానికి ఉ త్సాహంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజ లు స్వాగతం పలికారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కొత్త సంవత్సరానికి ఉ త్సాహంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సంబురాలు జరుపుకున్నారు. పుల్ జోష్‌గా కాలనీలు, ఇండ్లలో కేక్‌లు కట్ చేస్తూ పార్టీలు చేసుకున్నారు.అధికార యం త్రాంగం గురువారం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేశారు. జిల్లాలోని ప్రజలు ఉదయం నుంచే దేవాలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకున్నారు. వేములవాడ భీమేశ్వరాలయం, సిరిసిల్లలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం, శివసాయిబాబా దేవాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి ఇంటి ముంగిట రంగవళ్లులతో మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతంపలికారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవా ల్,ఎస్పీ మహేష్ బీ గీతేలకు అధికారులు శుభా కాంక్షలు తెలిపారు. టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కలెక్టర్‌తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్ర మంలో టీజీఈజేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్ కుమార్, కన్వీనర్ సమరసెన్, కార్యదర్శి గాజుల సుదర్శన్, సహా అధ్యక్షుడు మెట్ట శ్రీకాంత్, కోశా ధికారి మొహమ్మద్‌రియాజ్‌పాషా, ట్రస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్ కుమార్, ఏఎస్‌వోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్, వివిధ సంఘా ల ఫోరం జిల్లా అధ్యక్షలు, కార్యదర్శులు పాల్గొ న్నారు. బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శు భాకాంక్షలు తెలిపారు.
76 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపినా 76మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
జోరుగా మాంసం విక్రయాలు..
నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం రూ.3.10 కోట్ల విక్రయాలు జరిగాయి. మాంసం అమ్మకాలు జోరుగానే సాగాయి.జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా తందూరి చికెన్, రుమాలి రోటీ, సెంటర్లు ఏర్పడ్డాయి. ఒక్కో చికెన్ సెంటర్‌లలో వంద కిలోలకు పైగానే అమ్మకాలు జరిగాయి.