శ్రమ దోపిడీ ఎక్కడున్నా నిలదీస్తాం
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:25 PM
దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఇంటింటికి సీపీఐ - ప్రజల వద్దకు సీపీఐ నినాదంతో నిధుల సేక రణకు శ్రీకారం చుట్టగా చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రజల వద్దకు వెళ్లి నిధుల సేకరణలో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశానికి సీపీఐ పార్టీ కొత్త కాదని, దేశానికి స్వాతంత్య్రం రాకుముందే ఆవిర్భవిం చిందని సీపీఐకి ఎక్కడా డోకాలేదన్నారు. శ్రమ శక్తి దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులకు, కూలీలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగుబలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా సీపీఐ, ఆనుబంధ సంఘాలు వారి హక్కుల కోసం పోరాటాలు చేస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చా క కూడా దేశంలో ప్రజలకు మౌళిక సదుపా యాలు, వైద్య, విద్య,ఉపాధి అవకాశాలు కల్పిం చాలని సీపీఐ ఉద్యమాలు చేస్తుందన్నారు. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళ్తుందని దేశంలోని పేదలపైన పన్నులు, కార్పొరేట్ సంస్థలకు కేం ద్ర ప్రభుత్వం ఉచితాలను అందిస్తుందని ఆరో పించారు. ఎన్నికల సమయంలో సంక్షేమ పథ కాలంటూ ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ప్రజ లను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ ఆశించినట్లు దేశ సంపద అందరికి అందేలా, శ్రమకు తగ్గ ఫలితాలు రావాలని సీపీఐ ఆశిస్తుందన్నారు. దేశంలో జరగబోతున్న ఐదు రాష్టాల్లో బీజేపీ గెలవడం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లోని ప్రజలు ఆలోచ న చేయాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం వామపక్షాలను ప్రజలు బలపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము లు, నాయకులు వడ్డెపల్లి లక్ష్మన్, పవిత్ర, నల్ల చంద్రమౌళి, కొంక విజయ్, మంత్రి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.