మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:44 AM
మున్సిపాలిటీ ఎన్నిక ల్లో సత్తా చాటి కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి పిలుపుని చ్చారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోరుట్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ ఎన్నిక ల్లో సత్తా చాటి కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి పిలుపుని చ్చారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన మున్సి పాలిటీ ఎన్నికల సన్నాహక సమా వేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వరద కాలు వపై రూ.2 కోట్లతో వంతెన నిర్మించి సమస్యను పరిష్క రిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుం టుంద న్నారు. ప్రజా ప్రభుత్వంలో పథకాలకు మంచి స్పందన కనిపిస్తోందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలి టీల్లో 90శాతం విజయం సాధించాలని అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఉన్న ఇళ్ళ పట్టాల సమస్య, చెరువులు, కుంటల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రు లకు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. వెటర్నరీ కళాశాల వద్ద ఉన్న మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్‌రావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అన్నం లావణ్యఅనిల్, శీలం వేణు పాల్గొన్నారు.