Share News

నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:24 PM

కరీంనగర్‌ను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నగరంలోని 21వ డివిజన్‌ శ్రీరాంనగర్‌కాలనీ రోడ్‌ నంబరు 7, దివ్యాంగుల కాలనీలో 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం
శ్రీరాంనగర్‌కాలనీలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):కరీంనగర్‌ను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నగరంలోని 21వ డివిజన్‌ శ్రీరాంనగర్‌కాలనీ రోడ్‌ నంబరు 7, దివ్యాంగుల కాలనీలో 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పార్టీలకతీతంగా నగరాన్ని అభివృద్ధ్ది చేస్తున్నామన్నారు. 21వ డివిజన్‌కు నగరంలోని 66 డివిజన్లలోనే అత్యధికంగా 6 కోట్ల నిధులు కేటాయించామని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మంచినీటి పైపులైన్‌ నిర్మాణానికి 50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కర్రె అనిల్‌కుమార్‌, ఆయా కాలనీల ప్రజలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:24 PM