ఓటు హక్కును హరిస్తే సహించేది లేదు
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:51 AM
ఓటు హక్కును హరిస్తే సహిం చేది లేదని, కేంద్ర ఎన్నికల చీఫ్‌కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఎనగందుల వెంకన్నలు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఓటు హక్కును హరిస్తే సహిం చేది లేదని, కేంద్ర ఎన్నికల చీఫ్‌కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఎనగందుల వెంకన్నలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం అఖిల పక్షం ఆధ్వర్యంలో సర్ పేరుతో చేపట్టిన ఓటర్ల తొలగింపును నిలిపివేయాలం టూ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజా స్వామ్యానికి పునాది అని, అర్హుడైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సం ఘమే, ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ము సాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించినట్లు నివేది కలు వెలువడ్డాయన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి బయటపడకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించా లని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, తొలగించిన పేర్లకు సంబంధించిన వివరాలను బహిరంగపరచాలని, ఓటరుకు అభ్యంతరాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై తలెత్తిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఛీప్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, జిల్లా కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, సూరం పద్మ, అన్నదాస్ గణేష్, శ్రీరాముల రమేష్ చంద్ర, శ్రీరాం సదానందం, అడెపు రజిత, దశరథం తదితరులు పాల్గొన్నారు.