దళితులను కించపరిస్తే సహించం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:26 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధుబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు కొరివి అరుణ్‌కుమార్ అన్నారు.
గణేశ్‌నగర్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధుబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు కొరివి అరుణ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ ఇందిరాచౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించి తాత మధుబాబు దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాత మధుబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తాత మధుబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్, జీడి రమేష్, మీసాల సాయిలు, అబ్దుల్ రెహమాన్, ముల్కల కవిత, హస్తపురం తిరుమల, తీట్ల ఈశ్వరి, బత్తుల రాజ్‌కుమార్, ఫహాద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, యనమల మంజుల, కాంపల్లి కీర్తికుమార్, పెద్ది గారి తిరుపతి, ఎండీ చాంద్ పాల్గొన్నారు.