Share News

ప్రైవేటు పాఠశాల బస్సులు రానివ్వం

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:04 AM

మా గ్రామానికి ప్రైవేటు పాఠశా లల బస్సులు రానివ్వం, మా ఊరు పిల్లలందరినీ మా ఊరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామంటూ నంచర్ల గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

 ప్రైవేటు పాఠశాల బస్సులు రానివ్వం
నంచర్లలో బడిబాటలో సర్పంచ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు

పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామపంచాయతీ పాలక వర్గం తీర్మానం

పెగడపల్లి, జూన 12 (ఆంధ్రజ్యోతి): మా గ్రామానికి ప్రైవేటు పాఠశా లల బస్సులు రానివ్వం, మా ఊరు పిల్లలందరినీ మా ఊరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామంటూ నంచర్ల గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పెగడపల్లి మండలంలోని నంచర్ల సర్పంచ కుంటాల వనజ అధ్యక్షతన శుక్రవారం గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశమై మన ఊరు బడిని బతికించుకుందాం, మన ఊరు పిల్లలను మన బడిలో చేర్పిం చి నాణ్యమైన విద్య నేర్చుకునేలా ప్రోత్సహిద్దాము, ప్రైవేటు పాఠశాలల బస్సులను గ్రామంలోకి రానివ్వం, చేర్పించమంటూ తీర్మానం చేశారు. అనం తరం ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులతో కలసి సర్పంచ వనజ, ఉప సర్పంచ శ్యాంసుందర్‌ రెడ్డి, పం చాయతీ కార్యదర్శి పద్మ ఇల్లిల్లూ తిరుగుతూ బడిబాట నిర్వహించారు.

ఉపాధి హామీ కూలీల వద్దకు బడిబాట

రాయికల్‌: మండలంలోని అల్లీపూర్‌ గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్ర తిఒక్కరూ తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిం చారు. ప్రధానోపాధ్యాయుడు కిరణ్‌, ఉపాధిహమీ సూపర్‌ వైజర్‌ సాగర్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రాజేందర్‌, వసంతరావు, రవి కుమార్‌, రతీలాల్‌, రాజశేఖర్‌, రాజన్న, జీవన రెడ్డి, బాలమురళి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

కండ్లపల్లిలో బడిబాట

బీర్‌పూర్‌: మండలంలోని కండ్లపల్లిలో శుక్రవారం బడిబాట కార్యక్రమా న్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసం వేణుగోపాల్‌ ఆ ధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదం డ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ తొగిటి సత్తమ్మ, ఉపసర్పంచ ఎనగంటి రమేష్‌, వార్డు సభ్యులు పొలాస వెంకటేష్‌, పూదరి రాజం, గోపి రాజన్న, ఉరడి రాజేంధర్‌, గంగాధరి సంజన, శ్యామల యశో ద, పోతుగంటి సులోచన, ఉపాధ్యాయులు లచ్చయ్య, సత్యనారాయణ, మధుసూదన, భూమారెడ్డి, సూర్యప్రకాష్‌, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:04 AM